హన్మకొండ, జూలై 17,తెలంగాణ అనుక్షణం: హనుమకొండ కేంద్రంగా ఏర్పాటు చేసిన చిత్ర కళా శిక్షణ సంస్థ సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల యజ్ఞంలా నిర్వహిస్తున్న చిత్ర లేఖన పోటీల్లో భాగంగా ఈ నెల 21 వ తేదీన తెలంగాణ వారసత్వ సాంప్రదాయ సంస్కృతి అయిన బోనాల పండుగను పురస్కరించుకుని డ్రాయింగ్ పోటీలు, వ్యాస రచన పోటీలు, విచిత్ర వేషాధారణ పోటీలు, కవి సమ్మేళనం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంజుల ఒక ప్రకటనలో తెలిపారు.. హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో ఉదయం 9 గంటల నుండి ప్రారంభం అవుతాయని నాలుగు విభాగాలుగా నిర్వహిస్తూ, ప్రతి విభాగం లో మొదటి, రెండవ, మూడవ బహుమతులు ఉంటాయని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలు అందిస్తామని వివరాలకు 8143643337 లో సంప్రదించాలన్నారు..
ఈ నెల 21 న డ్రాయింగ్, వ్యాస రచన, విచిత్ర వేషధారణ పోటీలు