డా. సాగంటి మంజుల కు గురు వందనం 2025 అవార్డు

హన్మకొండ, జూలై 11,తెలంగాణ అనుక్షణం:గురు పౌర్ణమి సందర్భంగా పలు రంగాల్లో గురు స్థానం లోఉన్న ప్రముఖ వ్యక్తులకు ఈ నెల 12 వ తేదీ తెలంగాణ సారస్వత పరిషత్తు హైదరాబాద్ లో సృజన ఆర్ట్ క్రియేషన్స్ కల్చరల్ సోషల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో  "గురు వందనం అవార్డ్స్ 2025" అందించనున్నారు. ఈ కార్యక్రమానికి హనుమకొండ గోపాలపురానికి చెందిన సామాజిక వేత్త, ఎల్ బి విద్యా కళాశాల అధ్యాపకురాలు, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు అయిన డా.సాగంటి మంజులకు గురువందనం  2025 అవార్డు కు ఎంపిక చేశారు.  అధ్యాపక వృత్తిలో ఉపాధ్యాయులను తయారు చేస్తూ, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా ఎంతో మంది చిన్నారులకు చిత్ర కళలో శిక్షణ ఇస్తూ, డ్రాయింగ్ లోయర్, హయ్యర్ అభ్యర్థులకు మెళకువలు నేర్పిస్తూ, తన సంస్థ ద్వారా పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తూ, చిత్ర కళతో పాటు అధ్యాపక వృత్తిలో కొనసాగుతూ ముందుకు సాగుతున్న సాగంటి మంజుల కు ఈ అవార్డ్  ఇవ్వడం తమ సంస్థ కు గర్వకారణం అని సంస్థ అధ్యక్షులు రాజేష్ తెలిపారు.. ఈ సందర్భంగా మంజుల మాట్లాడుతూ మంచి సమాజాన్ని తయారు చేసే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే  వృత్తిలో తను పని చేయడం చాలా తృప్తిగా ఉందని, అలాగే తనకు ఇష్టమైన చిత్ర కళను నలుగురికి పంచడం తన అదృష్టం అని తనలోని గురువుని గుర్తించి అవార్డు ఇవ్వనున్న నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు.. ప్రముఖ చిత్ర కారులు, కవులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు, సామాజిక వేత్తలు  మంజులకు శుభాకాంక్షలు తెలిపారు.

Comments