మోదీ మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం

 
తెలంగాణ అనుక్షణం ఆగస్టు  31 తెలంగాణ అనుక్షణం:భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ మాతృమూర్తి పై అసభ్యకరమైన పదజాలంతో అవమానకరంగా అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ మున్సిపల్ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్ ఆధ్వర్యంలో స్ధానిక మెయిన్ సెంటర్ లో ధర్నా చేసి రాహుల్ గాంధీ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది.ఇటీవల బీహార్ లో కాంగ్రెస్ చేపట్టిన ర్యాలీ లో జాతీయ కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ పేపర్ లో రాయలేని అసభ్య పదజాలంతో మోదీ జీ తల్లి ని దూషించి, తిరిగి కనీసం ఆ మాటలను ఖండించకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాహుల్ గాంధీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి ఓబిసి మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, జిల్లా కౌన్సిల్ సభ్యులు భూతరాజు శ్రీహరి, జిల్లా పార్టీ నాయకులు అన్నెపర్తి యాదగిరి, రావిరాల శ్రీను, బోడ ఆంజనేయులు, పేర్ల గణేష్, ఇరిగి ఆంజనేయులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు భూతరాజు స్వామి, సోమ శంకర్, తడకమళ్ళ శ్రీధర్, యువమోర్చ  నాయకులు దోటి శివ,  ఉపాధ్యక్షులు చెనగాని శేఖర్, పల్లెగోని చంద్రమౌళి,  కారింగు విజయ్, కోశాధికారి మంచుకొండ సాగర్, జిట్టగోని రాము, దోటి నవీన్  తదితరులు పాల్గొన్నారు.

Comments