రైతులను నిలువు దోపిడీ చేస్తున్న ఫర్టిలైజర్స్ =కళ్ళెం సురేందర్ రెడ్డి
చండూరు మండలం ఆగస్టు 30,తెలంగాణ అనుక్షణం.రాష్ట్రవ్యాప్తంగా 45 కిలోల యూరియా బస్తా ఎంఆర్‌పీ రూ.270. విక్రయించాలి, చండూరు మండల కేంద్రంలో మాత్రం రూ.270కి విక్రయించాల్సిన బస్తాను రూ.400లకు విక్రయిస్తూ రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని బిజెపి జిల్లా నాయకులు తెలంగాణ ఉద్యమకారులు కళ్లెం సురేందర్ రెడ్డి ఆరోపించారు. రవాణా చార్జీ పేరిట బస్తాపై రూ.20 నుంచి రూ.30 వరకు అదనంగా వసూలు చేసేవారు. ఇప్పుడు ఏకంగా బస్తాపై రూ.130 అదనంగా తీసుకోవడంపై రైతులు భగ్గుమంటున్నారు. సబ్సిడీపై అందించాల్సిన యూరియా బినామీ పేరిట ఫర్టిలైజర్ దుకాణాల యాజమానులే నడిపిస్తున్నారు. వచ్చే టన్నుల కొద్ది యూరియాను బ్లాక్ చేసి ఫర్టిలైజర్ షాపులకు తరలిస్తున్నారు. సబ్సిడీపై ఇవ్వాల్సిన యూరియాను రూ.130కి అదనంగా విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధిక ధరలకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ చెబుతుంటే.. వ్యవసాయశాఖ అధికారులు తనిఖీలు చేయడం లేదు అన్నారు. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఫర్టిలైజర్స్ షాపుల వారు ఇష్టం వచ్చినట్లు వ్వవరిస్తున్నారని రైతులు వాపోతున్నారని తెలిపారు.