హన్మకొండ, ఆగష్టు 26,తెలంగాణ అనుక్షణం :ప్రముఖ చిత్ర కారిణి, బి. ఎడ్ కళాశాల అధ్యాపకురాలు,, గాయని, కవయిత్రి, రైటర్, సామాజిక వేత్త, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ - హెల్పింగ్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి కి ఈ ఆదివారం హనుమకొండ తనిష్క్ జ్యువలరీ కాన్ఫరెన్స్ హాల్ లో జరిగిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ 25 వ డ్రాయింగ్ కాంపిటీషన్ అనంతరం తాను చేస్తున్న సేవలను గుర్తించి దార్ల బుక్ అఫ్ రికార్డ్ ని సొసైటీ భాద్యులు దార్ల నాగేశ్వర్ రావు గారు అందించారు.. 2023 లో ఆమె చిత్ర కళా రంగానికి సేవ చేయాలనే ఉద్దేశ్యం తో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ని స్థాపించి చిన్నారులకు శిక్షణ ఇస్తూ, ప్రతి నెల ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకొని చిత్ర కళా పోటీలు నిర్వహిస్తూ, విజేతలకు బహుమతులు అందిస్తూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి ప్రశంసా పత్రాలను అందిస్తూ వందల మందికి చిత్ర కళ పట్ల ఆసక్తిని పెంచుతూ, వారిని ప్రోత్సాహిస్తూనే, హనుమకొండ లోని ప్రముఖ విద్యా కళాశాలలో అధ్యాపకురాలిగా ఎందరో విద్యార్థులను ఉపాధ్యాయులుగా తీర్చి దిద్దుతూ, సాహిత్య, సంగీత రంగాలలో రాణిస్తూ, సామాజిక సేవలో ముందుంటూ, ఎన్నో అవార్డులు గెలుపొందింది. ఎన్నో సన్మాన సత్కారాలు అందుకుంది...ఇటీవలి కాలంలో సామాజిక సేవా రంగంలో డాక్టరేట్ పట్టా పొందింది.. 24 ఆగష్టు 2025 ఆదివారం 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డ్రీం ఇండియా పేరుతొ మంజుల సగర్వంగా నిర్వహిస్తున్న 25 వ చిత్రకళ పోటీల్లో 79+79 మంది ఆర్టిస్టులు పాలొన్నారు.. మంజుల వివిధ రంగాల్లో చేస్తున్న సేవకు గాను ఆమెకి దార్ల బుక్ అఫ్ రికార్డ్స్ ని అందించడానికి సంతోషిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమం లో ప్రముఖ అరిస్ట్ చిప్పకుర్తి శ్రీనివాస్, డాక్టర్ హరినాథ్ హరిప్రియ దంపతులు, జయశ్రీ, వేణుగోపాల్, రఘుపతి, షో రూమ్ మేనేజర్ శశికిరణ్ గార్లు పాల్గొన్నారు...
సాగంటి మంజులకు దార్ల బుక్ అఫ్ రికార్డు