హన్మకొండ, తెలంగాణ అనుక్షణం :
సాగంటి మంజుల నేషనల్ ఆర్ట్ కాంపిటీషన్ లో బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డ్ గత నెలలో నిర్వహించిన సెల్యూట్ టూ ఇండియన్ సోల్జర్స్ సిందూర్ పేరిట క్రియేట్ హార్ట్ సంస్థ నిర్వహించిన నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంపిటీషన్ లో  హనుమకొండ కు చెందిన సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్, ఆర్టిస్ట్, లెక్చరర్ డాక్టర్  మంజుల సాగంటి వేసిన చిత్రం బెస్ట్ క్రియేటివ్ ఆర్టిస్ట్ అవార్డ్ ను గెలుచుకుంది. ఈ రోజు విడుదల అయిన ఫలితాల్లో ఆమె ఈ అవార్డ్ ను గెలుచుకున్నానని ఒక ప్రకటనలో తెలిపారు... కళామతల్లి కి సేవ చేయడం తన అదృష్టమని, చిత్ర కళను నలుదిక్కుల వ్యాపింప చేయడం తన లక్ష్యం అని అన్నారు... ఆమె గెలుపు పట్ల పలువురు చిత్రకారులు హర్షం వ్యక్తం చేశారు..

Comments