వరంగల్, జూలై 20,తెలంగాణ అనుక్షణం:బోనాల పండుగ సందర్భంగా వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని తన సొంత గ్రామమైన వంచనగిరిలోని గ్రామస్తులతో కలిసి బంగారు బోనం ఎత్తుకొని కోటగండి మైసమ్మ తల్లి ఆలయంలో బంగారు బోనం సమర్పించి మొక్కులు చెల్లించిన రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి గారు, డా!! అప్పాల అభిలాష్-కొండా సుష్మిత పటేల్ (చిట్టక్క) .ఈ సందర్భంగా కొండా సురేఖ గారు మాట్లాడుతూ ప్రకృతి పట్ల తెలంగాణ ప్రాంతానికున్న ఆరాధనకు, తెలంగాణ ప్రజల ఆధ్యాత్మిక తత్వానికి బోనాల ఉత్సవాలు నిదర్శనంగా నిలుస్తాయని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను, వైభవాన్ని బోనాలు జగద్వితం చేశాయని మంత్రి సురేఖ పేర్కొన్నారు.ప్రకృతిని తల్లిగా భావిస్తూ, బోనాలతో అమ్మవార్లకు పండుగ చేసే ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతూ వస్తున్నదనీ మంత్రి తెలిపారు.కోట గండి మైసమ్మ మైసమ్మ తల్లి ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ప్రజలు సుఖ సంతోషాలతో సకల సంపదలతో సుభిక్షంగా వర్ధిల్లాలని మంత్రి సురేఖ ప్రార్థించారు..
*బోనం ఎత్తిన "కొండా సురేఖ"*
* కోట గండి మైసమ్మ తల్లి బోనాల జాతరలో పాల్గొన్న రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ