
నిరక్షరాసుడితోపాటు, ఉన్నత చదువులు చదివిన వారు కూడా మనసు మీద నియంత్రణ కోల్పోయి అనేక ఆకృత్యాలకు పాల్పడుతున్నారన్నారు. మనిషి హార్డ్వేర్ అయితే మనసు సాఫ్ట్వేర్ అన్నారు, వ్యక్తిత్వ వికాసానికి ఈ పుస్తకం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ పుస్తకావిష్కరణ సభలో రచయిత మెండు ఉమామహేశ్వర్, అతిథులు ప్రముఖ సైకాలజిస్ట్ జి. నాగేశ్వరరావు, పిఆర్టియు హనుమకొండ మండల శాఖ అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మైమ్ కళాధర్, మిమిక్రీ ఆర్టిస్ట్ రాంపల్లి సదాశివ, సమావేశ సమన్వయకర్త ఆర్. లక్ష్మణ్ సుధాకర్ , ఉదయం పూర్వపాత్రికేయులు, పెద్ద సంఖ్యలో మేధావులు పాల్గొన్నారు. చివరగా రచయిత మెండు ఉమా మహేశ్వర్ ని ఉదయం మిత్రమండలి వెల్ఫేర్ అసోసియేషన్ పక్షాన, వివిధ ఉపాధ్యాయ సంఘాల పక్షాన ఘనంగా సత్కరించారు.