హన్మకొండ, ఆగష్టు 11,తెలంగాణ అనుక్షణం:కవులు తమ రచనల ద్వారా సమాజంలోమంచి మార్పులు తీసుకువస్తారని, వారు రాసే చిన్న చిన్న పదాలలో నిగూఢ అర్థం దాగి ఉంటుందని మామునూరు పోలీస్ ట్రైనింగ్ కళాశాల ఏసిపి కూజా విజయకుమార్ అన్నారు. సోమవారం నక్కలగుట్ట ఒక వేడుకల మందిరంలో ప్రముఖ కవయిత్రి బాదం జయశ్రీ , వెంకటేశ్వర్ల షష్టిపూర్తి సందర్భముగా రచించిన 60 కవితల పుస్తకాన్ని ప్రముఖ సామాజికవేత్త నిమ్మల శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ 60 కవితలు ప్రతీ ఒక్కరినీ ఆలోచింపచేసే విధంగా ఉన్నాయని కొనియాడారు. ఈ పుస్తకాన్ని తన భర్త బాదం వెంకటేశ్వర్లు కు అంకితం చేయటం అభినందనీయమని సంతోషం వ్యక్తం చేసారు. డాక్టర్ సాగంటి మంజుల జయశ్రీ కవితల్ని ప్రశంసిస్తూ షష్ఠి పూర్తి చేసుకుంటున్న జంటకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సౌమ్య, రాకేష్, రెయాన్ష్, నిఖిల్ సామ్రాట్, సాహితి , రామనరసింహస్వామి, శ్రీధర స్వామి, కుటుంబ సభ్యులు, బంధువులు, వేడుకకు వచ్చిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
*మదిలో మెదిలిన మాటలు కవితా పుస్తక ఆవిష్కరణ::*