డాక్టర్ సాగంటి మంజులకు "పద్మ చక్ర అవార్డు"

హన్మకొండ, ఆగష్టు 18,తెలంగాణ అనుక్షణం :హనుమకొండ గోపాలపురానికి చెందిన లెక్చరర్, సామాజిక వేత్త, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షురాలు, పెయింటింగ్ ఆర్టీస్ట్ ఐన డాక్టర్ సాగంటి మంజులకు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ, జి సి ఎస్ వల్లూరి ఫౌండేషన్  సంయుక్తంగా ఏర్పాటు చేసిన  ప్రత్యేక  కార్యక్రమంలో ప్రముఖ తెలుగు హాస్య నటులు మాజీ మంత్రి శ్రీ బాబు మోహన్ గారి చేతుల మీదుగా ప్రతిష్టాత్మక "పద్మ చక్ర-2025 అవార్డు" ని  హైదరాబాద్ రవీంద్ర భారతి లో ఆదివారం సాయంత్రం అందించారు...  79 వ స్వాతంత్ర దినోత్సవ సంబరాల్లో భాగంగా సంగీత, సాహిత్య, సామాజిక, విద్య, చిత్ర కళా రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మంజులకు ఈ అవార్డు ని ఇవ్వడం సంస్థ కు గర్వకారణం అని, తన వల్ల చాలా మంది చిన్నారులు చిత్ర కళలో రానిస్తున్నారని, తెలుగు సాహిత్యం లో తనదైన శైలి లో కవితలు రాసి చైతన్య పరుస్తూ, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు చేస్తూ, ఉపాధ్యాయ విద్య కళాశాలలో ఎందరో ఉపాధ్యాయులను తయారు చేస్తున్న  మంజులకు అవార్డు ఇవ్వడం సంతోషమని ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస రాజు అభినందించారు... మంజుల  మాట్లాడుతూ ఈ అవార్డు రావడం పట్ల సంతోషిస్తూ,  సమాజం పట్ల, కళల పట్ల నా బాధ్యత మరింత పెరిగిందని, మరెన్నో సేవా కార్యక్రమాలు చేసే దిశగా ప్రోత్సాహిస్తున్న సంస్థ బాద్యులకు, బాబు మోహన్ కి ఆమె కృతజ్ఞతలు తెలిపారు..

Comments