పిల్లల్లోని ప్రతిభ గుర్తించడం తల్లిదండ్రుల బాధ్యత. డీసీపీ వేముల శ్రీనివాస్

 
హన్మకొండ, సెప్టెంబర్ 04,తెలంగాణ అనుక్షణం: నవ చైతన్య గజానన యూత్ అసోసియేషన్ రాం నగర్ హనుమకొండ లోని వినాయక మంటపం వద్ద సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ డైరెక్టర్ డాక్టర్ మంజుల డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు... ఈ కార్యక్రమానికి కాలనీ లోని పిల్లలు దాదాపు 30 పాల్గొని బొజ్జ గణపయ్య ని వివిధ రకాలుగా చిత్రించారు... ముఖ్య అతిధిగా పాల్గొన్న డీసీపీ వేముల శ్రీనివాస్ పిల్లల్లోని ప్రతిభను గుర్తించే బాద్యత తల్లిదండ్రులదే. ఎవరిలో ఎలాంటి నైపుణ్యాలు ఉన్న వాటికి పదును పెట్టె దిశగా ప్రోత్సాహించాలని తల్లిదండ్రులకు సూచనలిస్తూ గెలుపొందిన చిన్నారులకు బహుమతులు పాల్గొన్న అందరికి ప్రశంసా పత్రాలు అందించారు... డైరెక్టర్ మంజుల మాట్లాడుతూ పిల్లల్ని చదువుతో పాటు అన్ని రంగాలలో గుర్తింపు తెచ్చుకునేలా, వారిలో ఉన్న ప్రత్యేక నైపుణ్యాలను  గుర్తించి తగు శిక్షణ ఇప్పించి ఆయా రంగాల్లో ఉన్నత స్థాయికి ఎదిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని 35 సంవత్సరాలుగా వినాయక నవరాత్రులు, హనుమాన్ చాలీసా పారాయణం, అన్నదానాలు తదితర కార్యక్రమాలను ప్రతి కుటుంబం  కలిసి జరుపుతున్న కాలనీ వారి ఐకమత్యాన్ని ప్రశంసించారు.. ఈ కార్యక్రమం లో జయశ్రీ, స్వాతి, నీరజ కాలనీ వాసులంతా పాల్గొన్నారు...

Comments