హన్మకొండ, ఆగష్టు 22,తెలంగాణ అనుక్షణం :హనుమకొండ లో సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ స్థాపించినప్పటి నుండి నెల నెల ఒక యజ్ఞంలా నిర్వహిస్తున్న చిత్రకళా పోటీల్లో భాగంగా 25 వ డ్రాయింగ్ పోటీలు ఈ నెల 24 ఆదివారం రోజున ఉదయం 11 గంటలకు హనుమకొండ లోని తనిష్క్ జ్యువెలరీ ఏసీ కాన్ఫరెన్స్ హాల్ లో జరుగనున్నాయి... 79 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా డ్రీం ఇండియా (భవిషత్తులో భారత్) అనే అంశం మీద ఈ పోటీలు జరుగుతాయని.. ఈ సారి 79+79+ మందితో రికార్డు నెలకొల్పాలని... దార్ల బుక్ అఫ్ రికార్డు ను సొంతం చేసుకునే దిశగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ మంజుల సాగంటి ఒక ప్రకటనలో తెలిపారు.. డ్రాయింగ్ తో పాటు పాల్గొన్న ప్రతి ఒక్కరు దేశభక్తి తో ఐ లవ్ మై ఇండియా అనే నినాదాన్ని 79 సార్లు జెండా రంగులతో రాసే విధంగా మరొక టాస్క్ ని ఇస్తున్నట్టు తెలిపారు... పాల్గొన్న ప్రతి ఒక్కరికి దార్ల బుక్ అఫ్ రికార్డు సర్టిఫికెట్, గోల్డ్ మెడల్ అందిస్తున్నామని మరిన్ని వివరాలకు 8143643337 లో సంప్రదించాలని సూచించారు...
ఈ నెల 24 న చిత్ర కళా పోటీలు..