విద్య పేరుతో " నిలువు " దోపిడీ ...!

కార్పొరేట్ విద్యాసంస్థల ఇష్టారాజ్యం

 - అడ్వాన్స్ కడితేనే పాఠ్య పుస్తకాలు

 - ఫీజు కట్టలేక కుదేలవుతున్న సామాన్యుడు 

 - జాలి లేని కసాయి యాజమాన్యాలు 

 - పట్టించుకోని విద్యా శాఖ అధికారులు

వరంగల్ ఉమ్మడి జిల్లా ప్రతినిధి , జూన్ 23 (తెలంగాణ అనుక్షణం) : తెలంగాణలో ప్రభుత్వం మారింది మాకు మంచి రోజులు వచ్చాయి . విద్యను కొనలేక , ఒత్తిడిని తట్టుకోలేక విలువైన విద్యార్థుల ప్రాణాలు గాలిలో కలిసి పోతున్నా ప్రభుత్వ విద్యా శాఖ అధికారులు పట్టించుకోక పోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .కార్పొరేట్ పాఠశాలలపై నిఘా ఎక్కడని ప్రశ్నిస్తున్నారు .ప్రభుత్వం కొత్తగా రావచ్చు కానీ అధికారులు పాతవారే కదా సూటిగా నిలదీస్తున్నారు . వేడుకుంటున్నారు .

 - ప్రైవేటు పాఠశాల స్కూళ్ల దందా ..

వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలో విద్య పేరుతో నిలువు దోపిడీ చేసే దందా నిరంతరాయంగా నడుస్తోంది . కనీసం కాస్త వ్యవధి ఇవ్వమని వేడుకున్నా కూడా కనికరించడం లేదని భాదిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు . అంతేగాక పుస్తకాలతో పాటు యూనిఫామ్ మా వద్దనే కొనాలి .. అంటూ తల్లిదండ్రులపై పెను భారాన్ని మోపుతున్నారు . దీంతో తమ పిల్లలు ఇబ్బంది పడతారని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు అధిక వడ్డీకి అప్పులు చేసి మరీ చెల్లిస్తున్నారు . ఫీజులు సకాలంలో చెల్లించని విద్యార్థులు ఆ విద్యా సంవత్సరం చదువు కోల్పోతున్నారు . ఈ బాధలు బయటకు చెప్పుకోలేక లోలోపలే వారు కుమిలిపోతున్నారు . సున్నితమైన మనస్సు కలిగిన కొందరు విద్యార్థుల ఆత్మహత్యలకు కన్న తల్లితండ్రులకు తీరని కడుపు కోత మిగులుతోంది . వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రైవేటు, పాఠశాలల్లో ఫీజులు విద్యార్థుల తల్లిదండ్రులకు ఏటేటా భారీగా మారుతున్నాయి. పలు ప్రైవేట్ పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు, ఇంటర్నేషనల్ పాఠశాలలు ఇష్టరాజ్యంగా ఫీజులు పెంచుతున్నాయి. 2024-25 విద్యా సంవత్సరంలో కొన్ని పాఠశాలలు ఏకంగా 25 శాతం వరకు ఫీజులు పెరిగాయి. కొన్ని పాఠశాలలు 40-50 శాతం భారం మోపుతున్నాయి. ఇప్పటికే చాలా విద్యా సంస్థల యాజమాన్యాలు కొత్త ఫీజుల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేసాయి .మరికొన్ని స్కూళ్లు పెంచిన ఫీజుల వివరాలను కూడా వెల్లడించకుండా విద్యార్థుల తల్లిదండ్రులను పీడిస్తూ వసూలు చేస్తున్నారు .

  - జాలి లేని కసాయి యాజమాన్యాలు..

వరంగల్ ఉమ్మడి జిల్లాలోని  వందలాది ప్రైవేటు  కార్పొరేట్  విద్యా సంస్థల యాజమాన్యాలు జాలి లేని కసాయి తనం ప్రదర్శిస్తున్నాయి .జేబులు నింపుకునేందుకు ఎగబడుతున్నాయి .ఆర్థికంగా లేని పేద వారు తమ పిల్లల చదువుల కోసం అప్పులు చేసైనా చదివించడంబాధాకరం. తమ పిల్లల బంగారుభవిష్యతు కోసం భూములు, ఆస్తులుసైతం అమ్ముకునే తల్లిదండ్రులు ఉన్నారంటే అతిశయోక్తి కాదు .ప్రతి సంవత్సరం పాఠశాలల యాజమాన్యాలు 15 శాతం నుంచి 50 శాతం వరకు ఫీజులు పెంచుకుంటూ పోతున్నారు .ప్రతి సంవత్సరం ఫీజులకు తోడు పుస్తకాలు,యూనిఫాం, బెల్ట్, టై, ఐడెంటిటీ కార్డు,స్టేషనరీ సామగ్రి పేరుతో అదనంగా రూ.10వేలకు పైగా గుంజేస్తున్నారు .ఇందులో కూడా అధికంగా లాభాలు వచ్చేలా చూసుకుంటున్నారు .ఇదంతా కూడా వ్యాపారంలో ఒక భాగంగా మారిపోయింది . ఇక కొత్తగా అడ్మిషన్ తీసుకోవాలంటే పాఠశాలను బట్టి రూ. 2 వేల నుంచి 5వేల వరకు లాగేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక మధ్యమధ్యలో వివిధ కల్చరల్ యాక్టివిటీస్, పార్టీల పేరుతో అదనంగాడబ్బులు వసూలు చేస్తున్నాయి .ఇకవీటికి తోడుగా వ్యాన్ ఫీజుల లెక్క వేరే.ప్రస్తుత కాలంలో తల్లిదండ్రులు ఎవ్వరి పనుల్లో వారు బిజీగా ఉండడంతో పిల్లలను తప్పనిసరిగా స్కూల్ బస్సుల్లోనే పంపిస్తున్నారు. దూరాన్ని బట్టి సంవత్సరానికి రూ.6 వేల నుంచి 12 వేలకు పైగా వ్యాన్ ఫీజులు వసూలుచేస్తున్నారు. ఇక కార్పొరేట్ స్కూళ్లల్లో పైఫీజులన్నీ మరింత అదనంగా ఉంటాయనిగుర్తించాలి.

-ఫీజులు ఫుల్... సౌకర్యాలు నిల్..

అనేక పాఠశాలల్లో కనీస నిబంధనలుపాటించడం లేదు. ఇరుకు గల్లీల్లో బిల్డింగ్స్ అద్దెకు తీసుకుని చిన్నచిన్న గదుల్లో తరగతులు నిర్వహిస్తున్నారు. టాయిలెట్స్ , తాగునీటి వసతి కల్పించడంలో విఫలమవుతున్నారు .విద్యార్థులు ఆడుకోవడానికి క్రీడా ప్రాంగణాలు కనీసం కన్పించడం లేదు. ఈ లోపాలకు తోడుఅధిక ఫీజులు, నాణ్యమైన విద్య అందించకపోవడం లాంటి తతంగాలు

నడుస్తున్నాయి .

  - పట్టించుకోని విద్యాశాఖ...

ఇక రకరకాల ఫీజుల పేరుతో చేస్తున్న దోపిడీపై ప్రశ్నించేందుకు ఎవ్వరూ సాహసించడం లేదు. విద్యాశాఖ అధికారులు తూతూ మంత్రంగా నిబంధనలు పాటించాలని పత్రికాప్రకటనలు చేయడమే తప్పా సీరియస్గా పాఠశాలలపై చర్యలు మాత్రం తీసుకోవడం లేదు .ఇక ప్రతి సంవత్సరంప్రైవేటు పాఠశాలల నుంచి విద్యా శాఖ అధికారులకు లక్షల్లో మామూళ్లు అందుతున్నాయని, అందుకే ప్రైవేటుపాఠశాలల వైపు అధికారులు కన్నెత్తి చూడడం లేదని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రైవేటుపాఠశాలల్లో 90 శాతం స్కూళ్లునిబంధనలను పాటించడం లేదు .ఇక పలు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తున్నప్పటికీ నాణ్యమైన విద్యను అందించడం లేదనే విమర్శలువ్యక్తమవుతున్నాయి. అర్హత లేనిఉపాధ్యాయులతో విద్యబోధనకొనసాగిస్తున్నారనే ఆరోపణలువస్తున్నాయి . ప్రైవేట్,కార్పొరేట్ స్కూళ్ల విషయంలో పలు నిబంధనలు విధించారు. పాఠశాలల్లోలాభదాయక వ్యాపారాలు చేయొద్దని,పుస్తకాలు, స్టేషనరీ తదితర సమగ్రిని లాభాలకు అమ్ముకోవద్దని తదితర నిబంధనలు ఉన్నాయి . ఈ నిబంధనలని రాష్ట్రవ్యాప్తంగా కచ్చితంగా అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులుకోరుతున్నారు. అంతేకాక అధిక ఫీజులు వసూలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక విధానాన్ని ఏర్పాటు చేయాలనే డిమాండ్లు విన్పిస్తున్నాయి. ఏటికేడు ఫీజులు పెంచుతున్నారే తప్ప అదుపులో మాత్రం ఉండడం లేదని, ఇలాగైతే పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలు ఏం చేయాలని ప్రశ్నిస్తున్నారు .

Comments