ఎల్కతుర్తి, మే 25(తెలంగాణఅనుక్షణం) :తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిష్కరించి 25 వసంతాలు పూర్తయిన సందర్భంగా ఈనెల 31న హైదరాబాద్ లో జరిగే సభకు పాత్రికేయులు భారీగా తరలిరావాలని టీడబ్ల్యుజేయూ (హెచ్143) జిల్లా అధ్యక్షుడు మస్కపురి సుధాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్షం రాజుకుమార్, రాష్ట్ర కార్యదర్శి తడక రాజ్ నారాయణ లు కోరారు. 25 వసంతాల పోస్టర్ ను ఎల్కతుర్తిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ జర్నలిస్టు ఫోరం ఆవిర్భవించి 25వ వసంతంలోకి అడుగు పెడుతుందని ఇందులో భాగంగా హైదరాబాద్ జలవిహార్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసమే అల్లం నారాయణ ఆధ్వర్యంలో టీడబ్ల్యుజేయూ 143 యూనియన్ ఆవిష్కరించిందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అన్ని వర్గాల ప్రజలు, ఉద్యమ సంఘాలను సంఘటితం చేసిన ఘనత టీజీఎఫ్ కే దక్కుతుందన్నారు.చారిత్రాత్మక నేపథ్యం కలిగిన జర్నలిస్ట్ ఫోరం రజతోత్సవ సంబరాలకు జిల్లా నుంచి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ ప్రెస్ క్లబ్ మాజీ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, నాయకులు కక్కెర్ల అనిల్ కుమార్, తాళ్లపల్లి వేణు, పబ్బు సతీశ్, కొన్నె దేవేందర్ రెడ్డి, బాణాల ధన్ రెడ్డి, సిద్ధూ, బాలసాని దేవేందర్ గౌడ్, వల్లాల వేణు, జన్నారపు వెంకటేష్, తాళ్ల శ్రీను, గట్టు రఘు, ఓస్కుల డేవిడ్, కొమునూరి రంజిత్, కందుకూరి రాజన్న, బండి కుమారస్వామి, నార్లగిరి మహేందర్, శ్రీనివాసరెడ్డి, హరీశ్, కందుకూరి మహేశ్, నల్లాల రాజిరెడ్డి, మౌటం శ్రీనివాస్, కొలుగూరి రాజుకుమార్, మహేశ్వర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.
టీడబ్ల్యూజేయూ సభకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో తరలిరావాలి - జిల్లా అధ్యక్షుడు మస్కపూరి సుధాకర్