ఆందోల్ మండలం, ఏప్రిల్ 27, తెలంగాణ అనుక్షణం :రాష్ట్రం అభివృద్ధి చెందడానికి కారణం బి ర స్ అని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలతో ఓట్లు వేయించుకొని ఇప్పుడు ప్రభుత్వ పాలన సక్రమంగా జరపడం లేదని క్రాంతి కిరణ్ ధ్వజమెత్తారు. రెండు ఎకరాల భూమి ఉన్నవారికి రైతు భరోసా మరియు ఇప్పటికీ ఇందిరమ్మ ఇండ్ల జాడలేదని ప్రభుత్వం ఏర్పడి ఇంచుమించు రెండు సంవత్సరాలకు దగ్గరకు వస్తుందని సర్పంచ్ ఎలక్షన్స్ మరియు ఎంపీటీసీ జెడ్పిటిసి ఎలక్షన్స్ నిర్వహించలేదని ఆయన తెలియజేశారు. టిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా జోగిపేట పట్టణంలో జాతీయ రహదారిపై ఈ వ్యాఖ్యలు చేశారు. మరియు బీఆర్ఎస్ జెండాను ఎగురవేశారు. టిఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో రాష్ట్రం బాగా అభివృద్ధి చెందిందని మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మాజీ టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీకాంతరెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ భూస్ణం టిఆర్ఎస్ సీనియర్ నాయకులు పాల్గొనడం జరిగింది.
జోగిపేట పట్టణంలో టిఆర్ఎస్ వ్యవస్థాపక దినోత్సవం