మాతృ దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ పోటీలు...

హన్మకొండ ,మే 06,తెలంగాణ అనుక్షణం:మాతృ దినోత్సవం సందర్భంగా డ్రాయింగ్ పోటీలు... ఈ నెల లో రాబోయే ముఖ్యమైన రోజు మాతృ దినోత్సవం సందర్భంగా ఈ శనివారం  అనగా 10 వ తేదీన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు హనుమకొండ పబ్లిక్ గార్డెన్ లో "మాతృదేవోభవ" అనే అంశం పై డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తున్నట్టు సాగంటి ఆర్ట్స్ అకాడమీ డైరెక్టర్ సాగంటి మంజుల తెలిపారు... ప్రతి నెల నిర్వహించే పోటీల్లో ఈసారి క్లే మోడలింగ్ (మట్టి బొమ్మల తయారీ) కూడా ఉంటుందని తెలిపారు...  డ్రాయింగ్ షీట్, క్లే అందిస్తామని మిగతా వస్తువులు వెంట తెచ్చుకోవాలని సూచించారు...ఆసక్తి ఉన్నవారు పేర్లు  8143643337 వాట్సప్ నంబర్ లో నమోదు చేసుకోవాలన్నారు... చిన్నారులకు వేసవి కాలాన్ని సద్వినియోగం  చేసుకొనడానికి డ్రాయింగ్ శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నట్టు ఆమె తెలిపారు... శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు కూడా అందిస్తామని అన్నారు.

Comments