ఎల్కతుర్తి మే 25, తెలంగాణ అనుక్షణం:హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామానికి చెందిన తెలంగాణ రైతు రక్షణ సమితి హనుమకొండ జిల్లా అధ్యక్షులు హింగే భాస్కర్ ఆధ్వర్యంలో ఇటీవల బాధ్యతలు స్వీకరించిన పింగిలి ప్రశాంత్ రెడ్డి ని ఆదివారం టీఆర్ఆర్ఎస్(తెలంగాణ రైతు రక్షణ సమితి) నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఏసీపీ ఆఫీసులో ఆయనకు పూల బొకే అందించి .. శాలువాతో ఘనంగా సత్కరించారు. ప్రజల అధికారిగా పింగిలి చక్కటి పేరు సంపాదిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏసీపి మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు జీలుగా విత్తనాలను రైతులు ఎందుకు పండించడం లేదని అన్నారు. జీలుగా విత్తనాలను కూరగాయలు రైతులు పండించాలని తెలిపారు. రైతులు ఎందుకు అన్ని రకాల పంటలు పండించి రైతులు కూడా గౌరవంగా బ్రతకాలని వారికి కావలసిన సహాయ సహకారాలు అందించాలని. నకిలీ విత్తనాల సరఫరా పై దృష్టి పెట్టి పోలీసులకు సమాచారం తెలపాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో రైతు రక్షణ సమితి ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వరికెల కిషన్ రావు, హనుమకొండ జిల్లా అధ్యక్షుడు హింగే భాస్కర్, జిల్లా ఉపాధ్యక్షులు చౌల రామారావు కమలాపూర్ మండల అధ్యక్షులు నూనె రమేష్ నాయకులు సుకినె సుధాకర్ రావు, అంబీరు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
కాజీపేట ఏసీపికి టి ఆర్ ఆర్ ఎస్ నేతల సన్మానం..