వేం నరేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ కార్యకర్తలు

 హన్మకొండ, మే18 (తెలంగాణ అనుక్షణం) :చింతగట్టు క్యాంపులో ఓ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డిని వర్ధన్నపేట శాసనసభ్యులు కే. ఆర్ నాగరాజు ఆధ్వర్యంలో 66 డివిజన్ కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికి  శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ వరంగల్ మార్కెట్ మాజీ డైరెక్టర్ వీసం సురేందర్ రెడ్డి, దేవస్థానం మాజీ చైర్మన్లు జన్ను రవీందర్, బల్సుకురి శ్రీనివాస్, ధర్మకర్తలు కనపర్తి రాజు, కొండమిడి సంతోష్, 66 వ డివిజన్ యూత్ అధ్యక్షులు తాళ్ల మధు ,చార్టెడ్ అకౌంటెంట్ తిప్పర్తి రాఘవరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పోలేపల్లి బుచ్చిరెడ్డి, జయగిరి గ్రామ అధ్యక్షులు రామంచ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు వెలిశోజు సురేష్, మట్టెడ భారత్  తదితరలు పాల్గొన్నారు.

Comments